Monday, 20 April 2026
  • Home  
  • నిరుపేదలకు అండగా అన్న క్యాంటీన్లు- బొజ్జల బృందమ్మ
- తిరుపతి

నిరుపేదలకు అండగా అన్న క్యాంటీన్లు- బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక రామసేతు వంతెన వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం పురస్కరించుకుని నారా భువనేశ్వరి పిలుపు మేరకు పట్టణంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పేదలకు, భక్తులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ద్వారా వేలాది మందికి ఉచితంగా భోజనం అందించడం సంతోషకరమని నిరుపేదలకు అండగా ఉండటమే ప్రభుత్వం, బొజ్జల కుటుంబ ఆశయమన్నారు. భోజనం చేస్తున్న వారితో బృందమ్మ ముఖాముఖి మాట్లాడి అక్కడి వసతులు, ఆహార నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు జన్మదినం వేళ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమాలు నిరుపేదల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని బృందమ్మ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.