Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

చిట్వేల్: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని చిట్వేల్ పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. రేణిగుంట డీఎస్పీ ఆదేశాల మేరకు, కోడూరు రూరల్ సీఐ సూచనలతో చిట్వేల్ ఎస్‌ఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని వివిధ గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటు, ఊరేగింపు నిర్వహణపై పలు సూచనలు చేశారు. డీజేలు, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద, ఊరేగింపు సమయంలో రాజకీయ పాటలు వినిపించడం, రాజకీయ జెండాలు ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మూడు రోజుల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఊరేగింపు సమయంలో డ్రైవర్ మద్యం సేవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సాయంత్రం 6 గంటల్లోపు ఊరేగింపు పూర్తి చేయాలని తెలిపారు. ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసులకు కమిటీ సభ్యులు సహకరించాలని ఎస్‌ఐ వినోద్ కుమార్ కోరారు.

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

వినాయక ఉత్సవాలపై పోలీసుల మార్గదర్శకాలు.. డీజేలపై నిషేధం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *