10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్–2026 విడుదల
అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 10,060 పోస్టులతో ‘జాబ్ క్యాలెండర్–2026’ విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు జీవో జారీ చేశారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాలుగు దశల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్య పోస్టులు:
గ్రూప్–1: 149 పోస్టులు
గ్రూప్–2: 673 పోస్టులు
డీఎస్సీ: 2,991 ఉపాధ్యాయ పోస్టులు
ఇవే కాకుండా పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్–2026.. నిరుద్యోగుల్లో ఆశలు!



