Thursday, 10 September 2026
  • Home  
  • నిజం గెలిచింది చీకటి రోజులను… గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులతో నిరసన
- విశాఖపట్నం

నిజం గెలిచింది చీకటి రోజులను… గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులతో నిరసన

చంద్రబాబుకు మద్దతుగా 53 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న టీడీపీ శ్రేణులు విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం నియోజకవర్గం, మంగమారిపేట (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 9 :: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, భీమునిపట్నం ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు పిలుపుతో మంగమారిపేట గ్రామంలోని 4వ వార్డులో “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని కొవ్వొత్తులతో నిరసనగా నిర్వహించారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు, శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు సభ్యులు గరికిన కింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం 53 రోజులపాటు “నిజం గెలిచింది” అంటూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు నిర్బంధం నుంచి విడుదలయ్యారని, తాము ప్రస్తావించిన అక్రమ కేసులపై న్యాయస్థానాల తీర్పులను కూడా గుర్తుచేసుకున్నారు. నాటి చీకటి రోజులను స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. “నిజం గెలిచింది.. ధర్మం గెలిచింది” అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జి గరికిన కింగ్, టీడీపీ సీనియర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు వాసుపల్లి ఎల్లయ్య, వాసుపల్లి రాజు, సూరాడ నర్సింగ్ రావు (అడ్వకేట్), BLAలు దూడ రమేష్, దౌవలపల్లి ఎల్లజీ, వాసుపల్లి రవి, వాసుపల్లి దాసు, మైలపల్లి దానయ్య, బుద్దల రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే చెవ్వాకుల కనకరాజు, వాసుపల్లి నరేంద్ర, సూరాడ అమర్నాథ్, సూరాడ సతీష్, సూరాడ నూకరాజు, దాసరి అమ్మోరు, గరికిన నాగరాజుతో పాటు మంగమారిపేట గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా 53 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న టీడీపీ శ్రేణులు

విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం నియోజకవర్గం, మంగమారిపేట (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 9 ::

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, భీమునిపట్నం ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు పిలుపుతో మంగమారిపేట గ్రామంలోని 4వ వార్డులో “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని కొవ్వొత్తులతో నిరసనగా నిర్వహించారు.

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షులు, శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు సభ్యులు గరికిన కింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం 53 రోజులపాటు “నిజం గెలిచింది” అంటూ అండగా నిలిచిందని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు నిర్బంధం నుంచి విడుదలయ్యారని, తాము ప్రస్తావించిన అక్రమ కేసులపై న్యాయస్థానాల తీర్పులను కూడా గుర్తుచేసుకున్నారు.

నాటి చీకటి రోజులను స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. “నిజం గెలిచింది.. ధర్మం గెలిచింది” అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జి గరికిన కింగ్, టీడీపీ సీనియర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు వాసుపల్లి ఎల్లయ్య, వాసుపల్లి రాజు, సూరాడ నర్సింగ్ రావు (అడ్వకేట్), BLAలు దూడ రమేష్, దౌవలపల్లి ఎల్లజీ, వాసుపల్లి రవి, వాసుపల్లి దాసు, మైలపల్లి దానయ్య, బుద్దల రవి తదితరులు పాల్గొన్నారు.

అలాగే చెవ్వాకుల కనకరాజు, వాసుపల్లి నరేంద్ర, సూరాడ అమర్నాథ్, సూరాడ సతీష్, సూరాడ నూకరాజు, దాసరి అమ్మోరు, గరికిన నాగరాజుతో పాటు మంగమారిపేట గ్రామ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.