Friday, 11 July 2025
  • Home  
  • నారా పాదయాత్ర చేయబోతున్నారా……? ` నియోజకవ్గాలకు వెళ్తేనే పార్టీపై పట్టు సాధిస్తారంటున్న నేతలు
- Featured

నారా పాదయాత్ర చేయబోతున్నారా……? ` నియోజకవ్గాలకు వెళ్తేనే పార్టీపై పట్టు సాధిస్తారంటున్న నేతలు

మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో బలమైన నేతగా ఎదిగేందుకు మాజీ మంత్రి నారా లోకేష్‌ త్వరలో కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే నారా లోకేష్‌ పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసి విజయం సాధించడంతో అదే పందాలో లోకేష్‌ కూడా నడిచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సారి సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పాదయాత్ర చేయడంతో 175 నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకులుతో సమావేశాలు నిర్వహించి ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నాయకులు మాత్రం పాదయాత్ర కన్నా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు , ప్రజలతో కలిసి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలి అనేదానిపై చర్చిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు పార్టీ నేతలతో ఎలా కలిసిపోయారో అలాగే లోకేష్‌ కూడా పార్టీ పై పట్టు సాధించాలంటే పార్టీ నేతలు, నాయకులతో కలిసి పోవాలని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా…? లేదా..? అన్న విషయాన్ని పక్కన పెడితే పార్టీ నాయకులతో లోకేష్‌ కలిసి పోతే రాజకీయంగా అనుభవంతో పాటు పార్టీపై పూర్తి పట్టు సాధించుకోవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలంటే తండ్రి చాటు బిడ్డలా కాకుండా తనకంటూ ఓ పత్య్రేకమైన మార్క్‌ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే చందబ్రాబు రాజకీయ వారసురడిగా ఎదిగిన లోకేష్‌ నియోజకవర్గాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోగలలిగితే రాజకీయంగా అనుభవం కూడా వస్తుందన్నది కొందరు నేతల అభిప్రాయం. పాదయాత్రతో లోకేష్‌ తిరుగులేని నేతగా ఎదగడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్‌ పాదయాత్ర చేస్తాడా… లేదా.. అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.