*నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని మహిళ మృతి*
*నాయుడుపేట పున్నమి న్యూస్ 04-08-26 దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య
*56 ఏళ్ల మహిళ వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించండి*
*మృతురాలి గుర్తింపుకు ప్రజల సహకారం కోరిన నాయుడుపేట పోలీసులు*
*గుర్తుతెలియని మహిళ మృతి – వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి*
*పేర, ఊరు తెలియని సుమారు 56 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం.*
*మృతురాలి పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ మహిళకు సంబంధించిన పేరు, చిరునామా లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు వెంటనే నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.*
*మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.*


