Saturday, 20 June 2026
  • Home  
  • నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు.. కమిషనర్‌కు కృతజ్ఞతలు
- తిరుపతి

నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు.. కమిషనర్‌కు కృతజ్ఞతలు

విజయవాడ, జూన్ 19: జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ స్టాఫ్ అధ్యక్షుడు కందటి విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషనర్ రంజిత్ భాషను విజయవాడలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ పదోన్నతులలో వారికి అవకాశం కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా సిబ్బందిలో నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. ఇందుకు కమిషనర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కమిషనర్ నిర్ణయంతో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి పొందిన నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతినిధులు కూడా ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో లేడీస్ సెక్రటరీ శిరీష, తొట్టంబేడు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ తదితరులు ఉన్నారు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.