నాగర్కర్నూల్ పట్టణ కేంద్రంలో స్నేహితులు ఉంటేనే ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని జై గౌడ మహిళా జిల్లా అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్ అన్నారు. జై గౌడ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మహిళలంతా కలిసి మెహందీ వేసుకుని సంబరాలు చేసుకున్నారు. స్నేహితుల ప్రోత్సాహం జీవితంలో ఎంతో కీలకమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి, నిర్మల, దివ్య, కవిత, పద్మ, లక్ష్మి, గీత పాల్గొన్నారు.
Uploaded Video:


