అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణుకను ఆమె భర్త విద్యాసాగర్ కారులో తీసుకెళ్తుండగా రఘునాథపాలెం సమీపంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కారులోనే రేణుకను హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును నిలిపిన విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం కాగా, రేణుకతో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



