Thursday, 25 June 2026
  • Home  
  • దొంగల ఆట కట్టించిన పోలీసులు…… ముగ్గురు అరెస్టులు..
- తిరుపతి

దొంగల ఆట కట్టించిన పోలీసులు…… ముగ్గురు అరెస్టులు..

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం యద్దలవారిపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న రెండు భారీ దొంగతనం కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.18.70 లక్షల విలువైన 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన అనంతమ్మ, యద్దల మౌనిక ఇళ్లలో భద్రపరిచిన బంగారు నగలను లక్ష్యంగా చేసుకున్న నిందితులు సుమారు 19 తులాల బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుల కదలికలను గుర్తించి రైల్వే కోడూరు–వై.కోట మార్గంలోని మూడు రోడ్ల కూడలి వద్ద అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కొండేటి జ్యోతి ప్రకాష్ అలియాస్ పవన్, ఉమ్మక శివ మనోజ్, నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన నగల్లో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అఖిల్ వర్ధన్ పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, ఎస్‌ఐ కె. సుజన్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు తమ విలువైన వస్తువుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం యద్దలవారిపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న రెండు భారీ దొంగతనం కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.18.70 లక్షల విలువైన 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
గ్రామానికి చెందిన అనంతమ్మ, యద్దల మౌనిక ఇళ్లలో భద్రపరిచిన బంగారు నగలను లక్ష్యంగా చేసుకున్న నిందితులు సుమారు 19 తులాల బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుల కదలికలను గుర్తించి రైల్వే కోడూరు–వై.కోట మార్గంలోని మూడు రోడ్ల కూడలి వద్ద అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో కొండేటి జ్యోతి ప్రకాష్ అలియాస్ పవన్, ఉమ్మక శివ మనోజ్, నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన నగల్లో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అఖిల్ వర్ధన్ పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, ఎస్‌ఐ కె. సుజన్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు తమ విలువైన వస్తువుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.