*దివంగత టీడీపీ నేత జాకీర్ కుటుంబానికి మంత్రి పొంగూరు నారాయణ పరామర్శ** జాకీర్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం కొండంత అండ: మంత్రి నారాయణ* నిబద్ధత కలిగిన సీనియర్ నాయకుడిని కోల్పోయాం: మంత్రి నారాయణ ఆవేదన* ఖుద్దుస్ నగర్లో జాకీర్ నివాసానికి మంత్రి నారాయణ.. కుటుంబ సభ్యులకు ఓదార్పు* పార్టీకి తీరని లోటు.. జాకీర్ సేవలు మరవలేనివి: మంత్రి నారాయణ దివంగత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, 43వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జి జాకీర్ కుటుంబాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గురువారం పరామర్శించారు. ఖుద్దుస్ నగర్ అర్చిలోని జాకీర్ నివాసానికి వెళ్లిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ—పార్టీ కోసం, నియోజకవర్గ సంక్షేమం

కోసం జాకీర్ అందించిన సేవలు అనితరసాధ్యమని కొనియాడారు; ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తూ, జాకీర్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మరియు ప్రభుత్వం ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయని స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని తమ గాఢ సానుభూతిని తెలిపారు.


