ఖమ్మంజులై 3
పున్నమి న్యూస్ /
పువ్వాడ నాగేంద్ర కుమార్, జిల్లా రిపోర్టర్
బీజేపీ దళిత మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బండ్ల రీగన్ ప్రతాప్ శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ, బండ్ల రీగన్ ప్రతాప్‌ను శాలువాతో సన్మానించి నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దళిత మోర్చాను మరింత బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా బండ్ల రీగన్ ప్రతాప్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

