శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష కాల పూజలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం ప్రదోష వేళలో ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారితో పాటు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శోభాయమానంగా షోడశోపచార పూజలు పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు వంటి షోడశోపచార ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి, అనంతరం బిల్వ పత్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రదోష పూజలో భాగంగా నందీశ్వరుడిని విశేషంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

త్రయోదశి పురస్కరించుకుని నందీశ్వరునికి విశేష అభిషేకాలు