పున్నమి: జులై 17 నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో ఓటర్ నమోదు కార్యక్రమం. SIR ప్రక్రియ గడువు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నాగులపల్లి గ్రామం 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు మూడు తారీకు వరకు గడువు ఉంటుందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్న వచ్చి బిఎల్ఓ ల దగ్గర నమోదు చేసుకోవాలని లేకపోతే ఎప్పటికీ ఓటు హక్కు ఉండదని, కాబట్టి మనకు ఏ పథకాలు వర్తించవు, దేశంలో లేని వాళ్ళమవుతామని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.






