హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నగర శివారు ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కొత్త కారిడార్లు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు.


