Tuesday, 16 June 2026
  • Home  
  • తెదేపా కార్యాలయంలో ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు, కూటమి రెండేళ్ల విజయోత్సవం
- తిరుపతి

తెదేపా కార్యాలయంలో ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు, కూటమి రెండేళ్ల విజయోత్సవం

శ్రీ కాళహస్తి, జూన్ 15, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన సదస్సుతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్, జనసేన పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో ప్రగతిశీల కార్యక్రమాలను అమలు చేస్తోందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కూటమి పార్టీల ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.