*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 16 తిరుపతి జిల్లా తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తిరుపతి జిల్లాకు చెందిన యువ వాలీబాల్ క్రీడాకారిణిలతో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడుప్రత్యేకంగా ముఖాముఖిసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రీడాకారిణులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఆయన, వారి క్రీడా ప్రస్థానం, శిక్షణలో ఎదుర్కొంటున్న సమస్యలు,భవిష్యత్,లక్ష్యాలు,జాతీయఅంతర్జాతీయ స్థాయిలో,రాణించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా తెలుసుకున్నారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితులు,విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం,తల్లిదండ్రుల వివరాలను అడిగి తెలుసుకుని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరియు శాప్ తరఫున అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.క్రీడాకారిణిలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు పౌష్టికాహారం, సింథటిక్ వాలీబాల్ కోర్ట్, ఆధునిక క్రీడా సామగ్రి, మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించాలని రవి నాయుడు ని కోరారు.దీనిపై స్పందించిన ఆయన, మహిళా వాలీబాల్ క్రీడాకారిణిల ప్రతిభను మరింత ప్రోత్సహించేలా తిరుపతిలో ప్రత్యేక వాలీబాల్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అకాడమీ ద్వారా నాణ్యమైన కోచింగ్, ఆధునిక క్రీడా సామగ్రి, మెరుగైన శిక్షణసదుపాయాలు, పౌష్టికాహారం వంటి అవసరమైన సౌకర్యాలను అందించేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.మహిళా వాలీబాల్,క్రీడాకారిణిలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువచ్చేలా శాప్ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని రవి నాయుడు స్పష్టం చేశారు



