Tuesday, 8 September 2026
  • Home  
  • తాత మధు అసెంబ్లీలో వ్యాఖ్యాలకు డొంకేశ్వర్ మండలంలో నిరసన సెగ,
- నిజామాబాద్

తాత మధు అసెంబ్లీలో వ్యాఖ్యాలకు డొంకేశ్వర్ మండలంలో నిరసన సెగ,

డొంకేశ్వర్ న్యూస్ సెప్టెంబర్::08 అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై దళిత స్పీకర్‌ను ఉద్దేశించి పరుష, అవమానకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగుల బాబురావు ఆధ్వర్యంలో తాత మధు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీలో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా, కులాన్ని ఉద్దేశించిఅవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనిఅన్నారు.దళితస్పీకర్‌నుఅవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు, కులపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు.అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కారం ఉండేలా సూచించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల మాజీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ బొజారెడ్డి, నాయకులు భరత్ రెడ్డి, దశ గౌడ్, చిన్న సాయన్న, దేగం గంగారెడ్డి, నాగరాజ్ వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

డొంకేశ్వర్ న్యూస్ సెప్టెంబర్::08

అసెంబ్లీ వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై దళిత స్పీకర్‌ను ఉద్దేశించి పరుష, అవమానకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ తాత మధు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్
మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగుల బాబురావు ఆధ్వర్యంలో తాత మధు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీలో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా, కులాన్ని ఉద్దేశించిఅవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనిఅన్నారు.దళితస్పీకర్‌నుఅవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు, కులపరమైన వ్యాఖ్యలకు తావివ్వకూడదని సూచించారు.అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కారం ఉండేలా సూచించాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల మాజీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ బొజారెడ్డి, నాయకులు భరత్ రెడ్డి, దశ గౌడ్, చిన్న సాయన్న, దేగం గంగారెడ్డి, నాగరాజ్ వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.