Tuesday, 8 September 2026
  • Home  
  • పర్యావరణహితంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు విత్తనాల రవితేజ జన్మదిన వేడుకలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పర్యావరణహితంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు విత్తనాల రవితేజ జన్మదిన వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు విత్తనాల రవితేజ మంగళవారం తన పుట్టినరోజు వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించి, ఆదర్శంగా నిలిచారు.పుట్టినరోజు వేడుకలకు కొత్త నిర్వచనం తెలియజేస్తూ పారిశుద్ధ్య కార్మికుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు ఆవులకు 50 కిలోల దాణా పంపిణీ పంపిణీ చేసి మూగజీవాల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గంటపాటు పనిచేసి, వారితోనే కేక్ కట్ చేసుకోవడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భవిత కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన 44 విద్యార్థులకు బహుమతులు, బిస్కెట్ ప్యాకెట్లు అందించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతమైన విద్యార్థికి రూ.2,000 విలువైన బహుమతి అందించి ప్రోత్సహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో ప్రజల్లోకి మరింతగా వెళ్లి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, పర్యావరణాన్ని కాపాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో ముందుకు సాగుతామని రవితేజ తెలియజేయడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.