తాళ్లపూడి/కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) ఏప్రిల్ఆ 30: ఆరికరేవుల ఇసుక ర్యాంపులలో ఇరిగేషన్ అధికారుల తనిఖీలు.
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో బోట్ మెన్ సొసైటీలలో తరచూ అక్రమ వ్యాపారం “డ్రెడ్జింగ్” కొనసాగుతుందని పలు పత్రికలలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవ్వూరు నియోజకవర్గం ఆరిక రేవుల బోట్ మెన్ సొసైటీ ర్యాంపులలో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ సందర్భంగా ఇరిగేషన్ (డి ఈ) కె. ఆనందబాబు మాట్లాడుతూ ఔరంగాబాద్ నుండి తాడిపూడి వరకు బోట్ మెన్ సొసైటీలలో డ్రెడ్జింగ్ పడవలను ఉపయోగించరాదని ఇసుక ర్యాంపు యాజమాన్యాలను హెచ్చరించడం జరిగిందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తనిఖీలలో ఇరిగేషన్ ఏ ఈ మణికంఠ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడులలో ఒక బోటు ను సీజ్ చేసినట్టు తెలిపారు.

డ్రెడ్జింగ్ నిషేధంపై హెచ్చరికలు – ఒక బోటు సీజ్
తాళ్లపూడి/కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా ( పున్నమి ప్రతినిధి ) ఏప్రిల్ఆ 30: ఆరికరేవుల ఇసుక ర్యాంపులలో ఇరిగేషన్ అధికారుల తనిఖీలు. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో బోట్ మెన్ సొసైటీలలో తరచూ అక్రమ వ్యాపారం “డ్రెడ్జింగ్” కొనసాగుతుందని పలు పత్రికలలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవ్వూరు నియోజకవర్గం ఆరిక రేవుల బోట్ మెన్ సొసైటీ ర్యాంపులలో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ సందర్భంగా ఇరిగేషన్ (డి ఈ) కె. ఆనందబాబు మాట్లాడుతూ ఔరంగాబాద్ నుండి తాడిపూడి వరకు బోట్ మెన్ సొసైటీలలో డ్రెడ్జింగ్ పడవలను ఉపయోగించరాదని ఇసుక ర్యాంపు యాజమాన్యాలను హెచ్చరించడం జరిగిందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తనిఖీలలో ఇరిగేషన్ ఏ ఈ మణికంఠ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ దాడులలో ఒక బోటు ను సీజ్ చేసినట్టు తెలిపారు.

