వార్త ముఖ్యాంశాలు
- తల్లి గెలుపు కోసం తనయుడి అలుపెరగని పోరాటం.
- చేస్తున్న వేగివాడ రవికుమార్ నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది...
- గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేగివాడ రమాదేవి గెలుపు కోసం ఆమె తనయుడు వేగివాడ రవికుమార్ ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు...
తల్లి గెలుపు కోసం తనయుడి అలుపెరగని పోరాటం.
చేస్తున్న వేగివాడ రవికుమార్
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది…
గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేగివాడ రమాదేవి గెలుపు కోసం ఆమె తనయుడు వేగివాడ రవికుమార్ ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు…
గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్తూ, ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తన తల్లిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు..
ప్రచారంలో భాగంగా రవికుమార్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో వర్ణించలేనివని భావోద్వేగంతో అన్నారు…
ప్రజల పిలుపు మేరకే, గ్రామానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో తన తల్లి రమాదేవి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు..
నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంలోనే అసలైన ఆత్మసంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు..
ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే తమ తల్లి విజయం ఇప్పటికే ఖరారైందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు..
”కొవ్వూరుపాడు గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, ఇతర అన్ని సౌకర్యాలను రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా అందిస్తాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం”
అని ఆయన గ్రామస్తులకు భరోసా ఇచ్చారు….
ప్రచారంలో రవికుమార్ చూపిస్తున్న చొరవ, ప్రజలతో మమేకమవుతున్న తీరు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.