తాడేపల్లిలో నేడు నిర్వహించిన ప్రెస్మీట్ అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో 12 స్వర్ణ పతకాలు సాధించినప్పటికీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందలేకపోయిన బాధితుడు దుర్గయ్యను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అంతర్జిల్లా స్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధించని కొందరికి క్రీడా కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టగా, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన దుర్గయ్య వంటి క్రీడాకారులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. :::

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అన్యాయం.. జగన్కు బాధితుడు దుర్గయ్యను పరిచయం చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి