Thursday, 11 June 2026
  • Home  
  • *సమగ్రత, ఖచ్చితత్వం పెంచేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) దోహదపడుతుంది – జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ*
- గుంటూరు

*సమగ్రత, ఖచ్చితత్వం పెంచేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) దోహదపడుతుంది – జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ*

*సమగ్రత, ఖచ్చితత్వం పెంచేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) దోహదపడుతుంది – జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ* గుంటూరు , జూన్ 11 :- ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన మరియు పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సూచించారు. గురువారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) పై ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియను గతంలో చివరిసారిగా 2002-03 సంవత్సరంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2026 లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను ఏపీలో చేపడుతున్నదన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) ప్రక్రియ జూన్ 5 నుండి ప్రారంభం అయిందని , తొలుత పది రోజులు పాటు సర్ నిర్వహణకు సన్నద్దత , బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. తరువాత నెల రోజులు పాటు బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారని , జులై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి , నెల రోజులపాటు క్లైములు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని , సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎటువంటి రిమార్కులు రాకూడదని , రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని , అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. సర్ ప్రక్రియపై ఎటువంటి సందేహాలు వున్నా అడిగి తెలుసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) లో భాగంగా ఈ ఆర్ ఓ (Electoral Registration Officers) లు, ఏ ఈ ఆర్ ఓ (Assistant Electoral Registration Officers) లకు నిర్వహించే శిక్షణ అత్యంత కీలకమైనదన్నారు. ఈ శిక్షణలో ప్రత్యేక సమగ్ర సవరణను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించడం జరిగిందన్నారు. బి ఎల్ ఓ లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియను ఎలా చేపట్టాలో తెలియజేయడం జరిగిందన్నారు. వారికి అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం జరుగుతుందన్నారు. ఓటరకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి రెండు రోజుల తర్వాతా ఒక ఫారాన్ని బిఎల్ఓ లు తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. కుటుంబంలో పిల్లలు ఆరు మంది వున్నా , కుంటుంబ సభ్యుల మధ్య వయస్సు ఎక్కువగా వుంటే క్రాస్ చెక్ చేయాలన్నారు. ఒకే ఓటరు రెండు చోట్ల ఉండటం , చనిపోయిన వారు, లేదా ఇల్లు మారి వెళ్ళిపోయిన వారి ఓట్లను గుర్తించాలని , ఫారం-6 కొత్త ఓటర్లు , ఫారం-7 తొలగింపులు మరియు ఫారం-8 సవరణలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని , ఓటరు నుండి డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సిస్టమ్‌లో ఎలా ప్రాసెస్ చేయాలి, ఓటర్ల సంఖ్య పరిమితిని దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేయాలి , ఓటర్లు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవకుండా పోలింగ్ కేంద్రాలను ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశాలపై ఈ శిక్షణా కార్యక్రమంలో మార్గదర్శకాలు అందజేయడం జరుగుతుందన్నారు. బిఎల్ఓ లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా పూర్తి చేయాలో ఈఆర్ ఓ లు, ఏఈఆర్ఓ తెలియజేయాలన్నారు. బి ఎల్ ఓ లు బి ఎల్ ఏ లతో సమావేశం నిర్వహించి సమావేశపు మినిట్స్ అప్లోడ్ చేయాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు బూత్ లెవల్ ఏజెంట్స్ తో సమావేశాలు ఎలా నిర్వహించాలని , ముసాయిదా (Draft) ఓటర్ల జాబితాను వారికి అందించి, వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా ఎలా పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు వుంటే కొత్త పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి , ఆర్డీవో శ్రీనివాసరావు , తెనాలి ఆర్ డి ఓ రమణి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి , ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు పాల్గొన్నారు.

*సమగ్రత, ఖచ్చితత్వం పెంచేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) దోహదపడుతుంది – జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ*

గుంటూరు , జూన్ 11 :- ఎటువంటి లోపాలు, దొంగ ఓట్లు లేని ఒక సమగ్రమైన మరియు పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లకు పని చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సూచించారు. గురువారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్ ) పై ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియను గతంలో చివరిసారిగా 2002-03 సంవత్సరంలో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో) నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2026 లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను ఏపీలో చేపడుతున్నదన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) ప్రక్రియ జూన్ 5 నుండి ప్రారంభం అయిందని , తొలుత పది రోజులు పాటు సర్ నిర్వహణకు సన్నద్దత , బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. తరువాత నెల రోజులు పాటు బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారని , జులై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి , నెల రోజులపాటు క్లైములు అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని , సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎటువంటి రిమార్కులు రాకూడదని , రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని , అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. సర్ ప్రక్రియపై ఎటువంటి సందేహాలు వున్నా అడిగి తెలుసుకోవాలన్నారు.

భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) లో భాగంగా ఈ ఆర్ ఓ (Electoral Registration Officers) లు, ఏ ఈ ఆర్ ఓ (Assistant Electoral Registration Officers) లకు నిర్వహించే శిక్షణ అత్యంత కీలకమైనదన్నారు. ఈ శిక్షణలో ప్రత్యేక సమగ్ర సవరణను ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించడం జరిగిందన్నారు. బి ఎల్ ఓ లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియను ఎలా చేపట్టాలో తెలియజేయడం జరిగిందన్నారు. వారికి అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం జరుగుతుందన్నారు. ఓటరకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి రెండు రోజుల తర్వాతా ఒక ఫారాన్ని బిఎల్ఓ లు తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. కుటుంబంలో పిల్లలు ఆరు మంది వున్నా , కుంటుంబ సభ్యుల మధ్య వయస్సు ఎక్కువగా వుంటే క్రాస్ చెక్ చేయాలన్నారు. ఒకే ఓటరు రెండు చోట్ల ఉండటం , చనిపోయిన వారు, లేదా ఇల్లు మారి వెళ్ళిపోయిన వారి ఓట్లను గుర్తించాలని , ఫారం-6 కొత్త ఓటర్లు , ఫారం-7 తొలగింపులు మరియు ఫారం-8 సవరణలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని , ఓటరు నుండి డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చే క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సిస్టమ్‌లో ఎలా ప్రాసెస్ చేయాలి, ఓటర్ల సంఖ్య పరిమితిని దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేయాలి , ఓటర్లు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవకుండా పోలింగ్ కేంద్రాలను ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశాలపై ఈ శిక్షణా కార్యక్రమంలో మార్గదర్శకాలు అందజేయడం జరుగుతుందన్నారు. బిఎల్ఓ లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా పూర్తి చేయాలో ఈఆర్ ఓ లు, ఏఈఆర్ఓ తెలియజేయాలన్నారు. బి ఎల్ ఓ లు బి ఎల్ ఏ లతో సమావేశం నిర్వహించి సమావేశపు మినిట్స్ అప్లోడ్ చేయాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు బూత్ లెవల్ ఏజెంట్స్ తో సమావేశాలు ఎలా నిర్వహించాలని , ముసాయిదా (Draft) ఓటర్ల జాబితాను వారికి అందించి, వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా ఎలా పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు వుంటే కొత్త పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు అందించాలన్నారు.

శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి , ఆర్డీవో శ్రీనివాసరావు , తెనాలి ఆర్ డి ఓ రమణి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి , ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.