గత వారంలో కరోనా వ్యాధి సోకి అస్వస్థకు గురైన నెల్లూరు నగరానికి చెందిన ఎముకలు కీళ్ల వైద్యులు డాక్టర్ పెనుకొండ లక్ష్మి నారాయణ రెడ్డి సోమవారం మరణించారు. రాష్ట్రములో కరోనాకు బలైన మొదటి వైద్యులు. కరోనా సోకినప్పటికీ తన వృత్తి ఐన వైద్యాన్ని నిర్వహిస్తూ కరోనా సోకి మరణించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో వున్నా అయన ఆరోగ్య పరిస్థితి మొన్న రాత్రి అకస్మాత్తుగా క్షీణించడంతో కృత్రిమ శ్వాస అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందారు. ఐ.ఎం.ఏ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తుంది. వారి సేవలను ముఖ్యముగా ఇటువంటి ప్రతికూల సమయములో వారిని స్లాఘిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తుందని ఐ.ఎం.ఏ. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్. వి.కె. ప్రసాద్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలవరపు ఫణిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైదులు, ప్రజలు జాగర్తలు పాటిస్తూ కరోనా నియంత్రణకు కృషి చెయ్యాలని ఐ.ఎం.ఏ కోరుకుంటుంది.