Friday, 11 July 2025
  • Home  
  • టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని అభినందిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి క్రిష్ణ లేఖ
- Featured

టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ని అభినందిస్తూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి క్రిష్ణ లేఖ

*టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ లేఖ ???* ————————————- ? బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలపై సబ్సిడీని నిలిపివేయాలి ? సిఫార్సులపై బ్రేక్ దర్శనానికి రూ. 10 వేలు ధర ? సిఫార్సులపై ఆర్జిత సేవలకు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు ధర ? సుపధం ప్రవేశం ద్వారా నూతన దర్శనం రూ. 1000 నుంచి రూ. 1500 ధరతో ప్రారంభించాలి ? రద్దీ నియంత్రణకు వారాంతపు, ఇతర సెలవు దినాల్లో టిక్కెట్ ధరపై 25 నుంచి 50 శాతం అదనంగా వసూలు చేయాలి ? వసూలు చేసిన అదనపు ఆదాయాన్ని సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించాలి ======================== To తేదీ :- 25-10-19 *శ్రీ వై. వి. సుబ్బారెడ్డి గారికి, చైర్మన్, టి.టి.డి. ధర్మకర్తల మండలి* *విషయం :- టి.టి.డి. – సాధారణ భక్తులకూ రూ.10 వేలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శనం కల్పించడం విప్లవాత్మక నిర్ణయం – అభినందనలు – సిఫార్సుల ద్వారా లభించే బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలకు సరైన ధర నిర్ణయించాలని సూచన.* ఎంతో కాలంగా అందని ద్రాక్ష లాగా ఉన్న శ్రీవారి వి.ఐ.పి. బ్రేక్ దర్శనాన్ని రూ.10,000 లకు సాధారణ భక్తులకూ అందుబాటులోకి తేవడం శుభపరిణామం. ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న మీకు, సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి గారికి, టి.టి.డి. ధర్మకర్తల మండలి సభ్యులకు, అధికారులకు అభినందనలు. మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శన అవకాశం ఇవ్వడం వలన ధనికులు, ఎగువ మద్యతరగతి భక్తులకు వి.ఐ.పి.లు, ప్రజాప్రతినిధులు, అధికారులు లేదా న్యాయమూర్తుల సిఫార్సు లేఖల కోసం పడిగాపులు కాయడం లేదా దళారులు, పైరవీకారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. రూ.10.000 విరాళం ఇస్తే ఒక రూ.500 వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుకు అవకాశం లభిస్తుండడం మంచి నిర్ణయం. సామాన్య భక్తులకు గర్భగుడి దాక వెళ్ళి దర్శనం చేసుకోవడం గగనంగా మారిన పరిస్థితులలో కొంచెం ధనాన్ని వెచ్చించగల ఎగువ మధ్యతరగతి భక్తులకు, సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని ధనిక భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ విధమైన పారదర్శక విధానం వలన ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో పైరవీకారులు చేస్తున్న అక్రమ చర్యలకు ముక్కుతాడు పడినట్లవుతుంది. *వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి – ఇతర దర్శనాలకు ఉన్న తేడాను ఒకసారి పరిశీలిస్తే…* (1) బ్రేక్ దర్శనంలో శ్రీవారి గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన స్వామి వారిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. (2) తోపులాటలు, హడావుడి ఉండదు. (3) తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం లభిస్తుంది. (4) గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడంతో పాటు వెనక్కి వచ్చే క్రమంలో కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. (5) గర్భగుడి దాకా వెళ్ళే అవకాశం ఉండడం వలన ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు. (6) ఇతర దర్శనాలలో కేవలం లఘు లేదా మహా లఘు దర్శనం మాత్రమే లభిస్తుంది. *టి.టి.డి. లోని వివిధ ట్రస్ట్ లకు ఇచ్చే విరాళాల ద్వారా బ్రేక్ దర్శనం లభించేది. అవి …* (1) రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-2 బ్రేక్ దర్శనం లభించేది. (2) రూ.1 కోటి పైన విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-1 బ్రేక్ దర్శనం మరియు 15 మందికి సుప్రభాత సేవ లభించేది. గర్భగుడి వరకు అనుమతించి దర్శనం చేసుకొనే వెసులుబాటు వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి ఉండడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దూరం నుంచే శ్రీవారిని తోపులాటల మధ్య అతి తక్కువసేపు దర్శించుకోవడానికి సర్వ దర్శనంతో పాటు రూ.50 లేదా రూ.300 ల టికెట్ లు అందుబాటులో ఉన్నాయి. దీనికి *కేవలం రూ.200 లు అదనంగా చెల్లిస్తే లభించే రూ.500 ల వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా ఎంతో మెరుగైన దర్శనం లభించడం ఎంతవరకు సబబు..?* *పై పేర్కొన్న విరాళాల మీద బ్యాంకు వడ్డీని లెక్కగట్టిన ఒక్కో మనిషి దర్శనం విలువ రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు ఉంటుంది. అంటే ఇంత విలువ చేసే దర్శనాన్ని ఇన్నాళ్ళు కేవలం రూ.500 లకే సిఫార్సు లేఖల మీద కల్పించారు.* దీంతో పైరవీకారులకు, ప్రజాప్రతినిధులు / అధికార గణానికి దగ్గరగా ఉండే వారికి మాత్రమే లాభం జరిగి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో అన్యాయం జరుగుతోంది. *ఇన్ని సంవత్సరాలపాటు పైరవీకారులకు, సిఫార్సులపై దర్శనం కల్పించిన వారికి సబ్సిడీ ఇచ్చినట్లు భావించాలి.* టికెట్ రేట్లు పెంచితే శ్రీవారి దర్శనం వ్యాపారీకరణంగా మారుతుందనే విమర్శకి భయపడి ఇన్నాళ్ళు ఈ సబ్సిడీని కొనసాగించారు. ఇప్పటికైనా మీరు ధైర్యంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ నేను చేస్తున్న మరికొ

*టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ గుంటూరు మాజీ మేయర్ రాయపాటి మోహన్ సాయి కృష్ణ లేఖ ???*
————————————-
? బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలపై సబ్సిడీని నిలిపివేయాలి

? సిఫార్సులపై బ్రేక్ దర్శనానికి రూ. 10 వేలు ధర

? సిఫార్సులపై ఆర్జిత సేవలకు రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు ధర

? సుపధం ప్రవేశం ద్వారా నూతన దర్శనం రూ. 1000 నుంచి రూ. 1500 ధరతో ప్రారంభించాలి

? రద్దీ నియంత్రణకు వారాంతపు, ఇతర సెలవు దినాల్లో టిక్కెట్ ధరపై 25 నుంచి 50 శాతం అదనంగా వసూలు చేయాలి

? వసూలు చేసిన అదనపు ఆదాయాన్ని సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించాలి
========================

To తేదీ :- 25-10-19

*శ్రీ వై. వి. సుబ్బారెడ్డి గారికి, చైర్మన్, టి.టి.డి. ధర్మకర్తల మండలి*

*విషయం :- టి.టి.డి. – సాధారణ భక్తులకూ రూ.10 వేలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శనం కల్పించడం విప్లవాత్మక నిర్ణయం – అభినందనలు – సిఫార్సుల ద్వారా లభించే బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలకు సరైన ధర నిర్ణయించాలని సూచన.*

ఎంతో కాలంగా అందని ద్రాక్ష లాగా ఉన్న శ్రీవారి వి.ఐ.పి. బ్రేక్ దర్శనాన్ని రూ.10,000 లకు సాధారణ భక్తులకూ అందుబాటులోకి తేవడం శుభపరిణామం. ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్న మీకు, సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి గారికి, టి.టి.డి. ధర్మకర్తల మండలి సభ్యులకు, అధికారులకు అభినందనలు. మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు వి.ఐ.పి. బ్రేక్ దర్శన అవకాశం ఇవ్వడం వలన ధనికులు, ఎగువ మద్యతరగతి భక్తులకు వి.ఐ.పి.లు, ప్రజాప్రతినిధులు, అధికారులు లేదా న్యాయమూర్తుల సిఫార్సు లేఖల కోసం పడిగాపులు కాయడం లేదా దళారులు, పైరవీకారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. రూ.10.000 విరాళం ఇస్తే ఒక రూ.500 వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుకు అవకాశం లభిస్తుండడం మంచి నిర్ణయం.

సామాన్య భక్తులకు గర్భగుడి దాక వెళ్ళి దర్శనం చేసుకోవడం గగనంగా మారిన పరిస్థితులలో కొంచెం ధనాన్ని వెచ్చించగల ఎగువ మధ్యతరగతి భక్తులకు, సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని ధనిక భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ విధమైన పారదర్శక విధానం వలన ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో పైరవీకారులు చేస్తున్న అక్రమ చర్యలకు ముక్కుతాడు పడినట్లవుతుంది.

*వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి – ఇతర దర్శనాలకు ఉన్న తేడాను ఒకసారి పరిశీలిస్తే…*

(1) బ్రేక్ దర్శనంలో శ్రీవారి గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన స్వామి వారిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. (2) తోపులాటలు, హడావుడి ఉండదు.
(3) తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం లభిస్తుంది.
(4) గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడంతో పాటు వెనక్కి వచ్చే క్రమంలో కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. (5) గర్భగుడి దాకా వెళ్ళే అవకాశం ఉండడం వలన ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు.
(6) ఇతర దర్శనాలలో కేవలం లఘు లేదా మహా లఘు దర్శనం మాత్రమే లభిస్తుంది.

*టి.టి.డి. లోని వివిధ ట్రస్ట్ లకు ఇచ్చే విరాళాల ద్వారా బ్రేక్ దర్శనం లభించేది. అవి …*

(1) రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-2 బ్రేక్ దర్శనం లభించేది.

(2) రూ.1 కోటి పైన విరాళం ఇచ్చే వారికి ఇతర సదుపాయాలతో పాటు 15 మందికి ఎల్-1 బ్రేక్ దర్శనం మరియు 15 మందికి సుప్రభాత సేవ లభించేది.

గర్భగుడి వరకు అనుమతించి దర్శనం చేసుకొనే వెసులుబాటు వి.ఐ.పి. బ్రేక్ దర్శనానికి ఉండడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దూరం నుంచే శ్రీవారిని తోపులాటల మధ్య అతి తక్కువసేపు దర్శించుకోవడానికి సర్వ దర్శనంతో పాటు రూ.50 లేదా రూ.300 ల టికెట్ లు అందుబాటులో ఉన్నాయి. దీనికి *కేవలం రూ.200 లు అదనంగా చెల్లిస్తే లభించే రూ.500 ల వి.ఐ.పి. బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా ఎంతో మెరుగైన దర్శనం లభించడం ఎంతవరకు సబబు..?*

*పై పేర్కొన్న విరాళాల మీద బ్యాంకు వడ్డీని లెక్కగట్టిన ఒక్కో మనిషి దర్శనం విలువ రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు ఉంటుంది. అంటే ఇంత విలువ చేసే దర్శనాన్ని ఇన్నాళ్ళు కేవలం రూ.500 లకే సిఫార్సు లేఖల మీద కల్పించారు.* దీంతో పైరవీకారులకు, ప్రజాప్రతినిధులు / అధికార గణానికి దగ్గరగా ఉండే వారికి మాత్రమే లాభం జరిగి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో అన్యాయం జరుగుతోంది. *ఇన్ని సంవత్సరాలపాటు పైరవీకారులకు, సిఫార్సులపై దర్శనం కల్పించిన వారికి సబ్సిడీ ఇచ్చినట్లు భావించాలి.* టికెట్ రేట్లు పెంచితే శ్రీవారి దర్శనం వ్యాపారీకరణంగా మారుతుందనే విమర్శకి భయపడి ఇన్నాళ్ళు ఈ సబ్సిడీని కొనసాగించారు. ఇప్పటికైనా మీరు ధైర్యంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తూ నేను చేస్తున్న మరికొ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.