సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 2026 అమరావతి ఛాంపియన్షిప్ వాలీబాల్ ఎంపిక పోటీల్లో జమ్మలపాలెం విద్యార్థులు, యువకులు ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో డి. అవినాష్, అండర్-23 విభాగంలో కె.వి. సుధీర్, పి. ఆకాశ్, కె. జితేంద్ర, సాత్విక్, పి. వరుణ్, ఎస్.కే. అబ్దుల్లా, సుమంత్ ఎంపికైనట్లు పీడీ అశోక్ బాబు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను, వారికి శిక్షణ అందించిన పీడీ అశోక్ బాబును గ్రామస్తులు అభినందించారు. జిల్లా స్థాయిలోనూ రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.



