కోవూరు ఆగస్టు 14
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం దాదాపుగా వంద మీటర్ల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మాతరం … వందేమాతరం… అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సుజాత మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ ఐక్యత, జాతీయ జెండాపై గౌరవభావాలను ఈ ర్యాలీ పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.



