రాష్ట్రంలో డయేరియా భయాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. కలుషిత నీటిపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) క్షేత్రస్థాయిలో నాణ్యత ఆపరేషన్ ప్రారంభించింది.
సర్వేపల్లి, కోవూరు, గూడూరు, వెంకటగిరి పరిధిలో ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ట్యాంక్, చేతిపంపు, పైప్‌లైన్ నీటిని అధికారులు స్కానింగ్ చేస్తున్నారు. వెంకటాచలం, పొదలకూరు, మనుబోలు తదితర మండలాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, రోగాలకు చెక్ పెట్టేలా ‘శుద్ధ జల’ సమరానికి తెరలేపారు.


