జలదంకి మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో “నిజం గెలుస్తుంది” నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మండల కన్వీనర్ మునగాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు “నిజం గెలుస్తుంది” అనే సందేశాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా నాయకులు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ప్రజాసేవలో కొనసాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పులుగుంట మధుమోహన్ రెడ్డి, కరియవుల అప్పలనాయుడు, ఒంటేరు జై చంద్రారెడ్డి, దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జలదంకిలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ