వార్డు మెంబర్గా ఎన్నికైన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఘన సత్కారం
ఆత్మకూరు , ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘జనసేన ఆత్మీయ సమావేశం’లో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని, ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైన శ్రీరామ్ పసుపులేటిని ఘనంగా సన్మానించారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా శ్రీరామ్ పసుపులేటి సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెన్నవాడ గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి వార్డు మెంబర్గా గెలిపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీరామ్ పసుపులేటి తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
తనకు ఈ గౌరవం దక్కేందుకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వెన్నవాడ గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను పెంచిందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని శ్రీరామ్ పసుపులేటి అన్నారు.


