కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో చెరుకూరి వెంకటాద్రి నాయుడు–వెంకట అరుణ దంపతుల కుమారుడు వెంకట నవీన్, కోడే వెంకటరావు (లేట్)–లక్ష్మి దంపతుల కుమార్తె వెంకట సాయి సింధు ప్రియ వివాహ గంధపు నలుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఆయన, వివాహం రెండు కుటుంబాలను ప్రేమాభిమానాలతో కలిపే పవిత్ర బంధమని పేర్కొన్నారు. దంపతులు ఆయురారోగ్యాలతో, ఆనందమయ దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.



