చిట్వేలి మండలంలోని పి.ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి రామిశెట్టి కుశాల్ జాతీయ స్థాయి ఇస్రో యువికా–2026 కార్యక్రమానికి ఎంపిక కావడంతో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎస్. కుమార్ అభినందించారు.శుక్రవారం నిర్వహించిన “బడీ పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎస్. కుమార్, సీఎంవో సురేష్, డిప్యూటీ డీఈఓ దేవరాజ్ తదితరులు రైల్వే కోడూరులో విద్యార్థుల నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన అధికారులు, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఇస్రో యువికా–2026 వర్క్‌షాప్‌కు ఎంపికైన యంగ్ సైంటిస్ట్ రామిశెట్టి కుశాల్‌తో పాటు గైడ్ టీచర్ ఎ. శివనారాయణ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.ఇప్పటికే రామిశెట్టి కుశాల్ సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్, సమగ్ర సైన్స్ మహోత్సవ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు తెలిపారు. విద్యార్థి సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

చిట్వేల్ విద్యార్థికి జిల్లా విద్యాశాఖ అధికారుల అభినందనలు