– రూ.1.26 లక్షల విలువైన టపాసులు స్వాధీనం
– లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
చిట్వేల్ మండలం చిల్లవాండ్లపల్లె గ్రామ సమీపంలోని మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఎస్. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.1,26,510 విలువైన ఎనిమిది రకాల టపాసులు పట్టుబడ్డాయి. లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత 288, పేలుడు పదార్థాల చట్టంలోని 9(బి)(1)(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లైసెన్స్ లేని వ్యక్తుల వద్ద టపాసులు కొనుగోలు చేయరాదని, అక్రమ నిల్వలు, విక్రయాలపై సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.


