నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేట తడికల బజారు సెంటర్‌లోని బీఎస్పీ జిల్లా కార్యాలయంలో ఈరోజు చలో ఆకువీడు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, దళిత క్రిస్టియన్లపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అకీవీడులో గొంతెనమ్మ గుడి కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తూ, మే 3న జరిగే చలో ఆకువీడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు జానకి ప్రసాద్, పుష్పాంజలి, భాస్కర్ గౌడ్, బి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.

చలో ఆకువీడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీఎస్పీ పిలుపు