పున్నమి: చాంద్రాయణగుట్ట: బండ్లగూడ, దుర్గానగర్, లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బాలాపూర్ మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన శాకాహార వంటకాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, బాలాపూర్ కార్పొరేటర్ ప్రభాకర్‌రెడ్డి, శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్ యజమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాఘవేంద్ర ఉడిపి ప్యూర్ వెజ్‌లో టిఫిన్స్, మీల్స్, సౌత్ ఇండియన్, చైనీస్ తదితర శాకాహార వంటకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.



