Thursday, 10 September 2026
  • Home  
  • ఓబులవారిపల్లి గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీ
- తిరుపతి

ఓబులవారిపల్లి గ్రంథాలయంలో ఆకస్మిక తనిఖీ

– గ్రంథాలయ సేవలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి – జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా పుస్తకాల అందుబాటు – ఆన్‌ డిమాండ్‌ కింద కొత్త పుస్తకాలు మంజూరు చేస్తాం ఓబులవారిపల్లి శాఖా గ్రంథాలయాన్ని కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి భాను ప్రకాష్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు జాబ్‌ క్యాలెండర్‌ నోటిఫికేషన్లు ఉపయోగపడేలా అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఆన్‌ డిమాండ్‌ విధానంలో కొత్త పుస్తకాలను మంజూరు చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కావాల్సిన వారు గ్రంథాలయాన్ని సంప్రదించాలని సూచించారు. గ్రంథాలయాన్ని కేవలం పుస్తక పఠనానికే కాకుండా ఉద్యోగ సాధనకు ఉపయోగపడే వేదికగా వినియోగించుకోవాలని కోరారు.

– గ్రంథాలయ సేవలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

– జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా పుస్తకాల అందుబాటు

– ఆన్‌ డిమాండ్‌ కింద కొత్త పుస్తకాలు మంజూరు చేస్తాం

ఓబులవారిపల్లి శాఖా గ్రంథాలయాన్ని కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి భాను ప్రకాష్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు జాబ్‌ క్యాలెండర్‌ నోటిఫికేషన్లు ఉపయోగపడేలా అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఆన్‌ డిమాండ్‌ విధానంలో కొత్త పుస్తకాలను మంజూరు చేస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కావాల్సిన వారు గ్రంథాలయాన్ని సంప్రదించాలని సూచించారు. గ్రంథాలయాన్ని కేవలం పుస్తక పఠనానికే కాకుండా ఉద్యోగ సాధనకు ఉపయోగపడే వేదికగా వినియోగించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.