Wednesday, 16 September 2026
  • Home  
  • గ్రామాల్లో వివాదాలకు చెక్‌.. కోర్టు కేసులకు గుడ్‌బై..!
- అనకాపల్లి

గ్రామాల్లో వివాదాలకు చెక్‌.. కోర్టు కేసులకు గుడ్‌బై..!

యలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ మధ్యవర్తిత్వానికి NALSA శ్రీకారం గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వ్యవస్థను రూపొందించింది. “Community Mediation – Towards a Litigation-Free Rural India” పేరిట రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ద్వారా గ్రామాల్లో కోర్టు కేసులు లేని వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కుటుంబ కలహాలు, పొరుగువారి మధ్య వివాదాలు, భూ సరిహద్దులు, ఆస్తి సమస్యలు, నీటి వినియోగం, చిన్నపాటి డబ్బు బకాయిలు తదితర వివాదాలను ప్రారంభ దశలోనే పరస్పర చర్చలు, అవగాహన, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యకు పరిష్కారం కనుగొనడం ద్వారా వివాదాలు పెద్దవిగా మారకుండా అడ్డుకోవచ్చు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వంతో గ్రామీణ ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కుటుంబ, సామాజిక సంబంధాలు కూడా దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తూ “కోర్టు కేసులు లేని గ్రామాల” దిశగా ప్రజలను చైతన్యపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

యలమంచిలి (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):

గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ మధ్యవర్తిత్వానికి NALSA శ్రీకారం

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వ్యవస్థను రూపొందించింది. “Community Mediation – Towards a Litigation-Free Rural India” పేరిట రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ద్వారా గ్రామాల్లో కోర్టు కేసులు లేని వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

కుటుంబ కలహాలు, పొరుగువారి మధ్య వివాదాలు, భూ సరిహద్దులు, ఆస్తి సమస్యలు, నీటి వినియోగం, చిన్నపాటి డబ్బు బకాయిలు తదితర వివాదాలను ప్రారంభ దశలోనే పరస్పర చర్చలు, అవగాహన, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యకు పరిష్కారం కనుగొనడం ద్వారా వివాదాలు పెద్దవిగా మారకుండా అడ్డుకోవచ్చు.

కమ్యూనిటీ మధ్యవర్తిత్వంతో గ్రామీణ ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కుటుంబ, సామాజిక సంబంధాలు కూడా దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తూ “కోర్టు కేసులు లేని గ్రామాల” దిశగా ప్రజలను చైతన్యపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.