శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : గత వైసీపీ పాలకుల అక్రమాలను ఎదిరించి ప్రాణత్యాగం చేసిన తొట్టంబేడు మండల టీడీపీ బీసీ విభాగం నాయకుడు మేలుపాకు గోపీ ముదిరాజ్ త్యాగం వెలకట్టలేనిదని ఆ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం.ఉమేష్ రావు కొనియాడారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ క్యాడర్ సమావేశం అనంతరం ఆయన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిలను కలిసి గోపీ ముదిరాజ్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 2020 మే 29న తొట్టంబేడులో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల కబ్జాలను అడ్డుకున్నందుకే వైసీపీ నాయకులు గోపీ ముదిరాజ్‌ను అమానుషంగా హత్య చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ ఆటవిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన ధర్మ పోరాటంలో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారిలో అత్యధికులు బీసీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి భూదోపిడీపై ఎన్డీయే కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా, యంత్రాంగం కబ్జారాయుళ్లకే మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. వైసీపీ శ్రేణుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన త్యాగధనుల పోరాటాలను నిష్ఫలం కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, పీఏసీఎస్ చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, పార్టీ నాయకులు వజ్రం కిషోర్, చిల్లకూరు మణి, కోట చంద్రశేఖర్, బీమాల చందు, వెంకటేశ్వర్లు, గురుమూర్తి, మునిప్రసాద్, మునిరత్నం, దామోదరం, వెంకటయ్య, చలపతి, సాయి, నాగరాజు పాల్గొన్నారు.

గోపీ ముదిరాజ్ త్యాగం వెలకట్టలేనిది-ఉమేష్ రావు