Friday, 3 July 2026
  • Home  
  • ఇసుక మాఫియా అరాచకాలకు మరో ప్రాణం బలి-మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
- తిరుపతి

ఇసుక మాఫియా అరాచకాలకు మరో ప్రాణం బలి-మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

శ్రీ కాళహస్తి, జులై 02 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇసుక మాఫియా దారుణాలకు మరో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు బలికావడం అత్యంత విచారకరమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు గోపి గౌడ్ సోదరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మురళి.. విధి నిర్వహణ ముగించుకుని వస్తుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందారు. బుధవారం శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మురళి పార్థివదేహాన్ని మధుసూదన్ రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల పదోన్నతి పొందిన హెడ్‌మాస్టర్ మురళి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న తండ్రీకొడుకులు, నేడు ప్రధానోపాధ్యాయుడు ఇసుక, మట్టి మాఫియా వల్ల ప్రాణాలు కోల్పోవడం ఘోరమన్నారు. స్థానికంగా ఎలాంటి నిర్మాణాలు జరగకపోయినా, రోజుకు వందల కొద్దీ ట్రాక్టర్లలో ఇసుక, మట్టి అక్రమంగా చెన్నైకి తరలిపోతోందని ఆరోపించారు. ఇటీవల 30 ట్రాక్టర్లను సీజ్ చేస్తే, అధికార పార్టీ ఒత్తిళ్లతో 10 ట్రాక్టర్లను వదిలేసి కేవలం 20 ట్రాక్టర్లపైనే పెనాల్టీ వేయడం వెనుక ఉన్న రాజకీయ ప్రమేయాన్ని ఖండించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ, ఈ ఘటనల్లో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే రౌడీ షీట్లు, తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియాపై జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రత్యక్ష నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, మున్నా రాయల్, పటాన్ ఫరీద్, గోరా, కోలూరు హరి నాయుడు, రామచంద్ర రెడ్డి, గఫూర్, బాలిశెట్టి శేఖర్, జూమ్లేష, ఆరిఫ్, డాక్టర్ శంకర్, మొగరాల గణేష్, అస్లాం, బావాజీ, జై కృష్ణారెడ్డి, దివ్య కాంత్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.