నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ సీనియర్ నాయకులు గొల్లపల్లి మోహన్‌రావు మాదిగ తండ్రి గొల్లపల్లి చిన్నయ్య మాదిగ (08-08-2026) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నాయకులు, గ్రామస్తులు ఆదివారం ఆయన మృతదేహానికి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఎంఆర్‌పీఎస్–ఎంఎస్పీ ఇన్‌చార్జి గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, నెల్లూరు జిల్లా ఎంఎస్పీ ఇన్‌చార్జి పందిటి అంబేద్కర్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దుత్తలూరు మండలంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరయ్యారు.

గొల్లపల్లి చిన్నయ్య మాదిగ మృతదేహానికి ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నాయకుల ఘన నివాళి