అనపర్తి, జూలై 30 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతిని పురస్కరించుకొని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గురు రవిదాస్ మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, సోదరభావం, మానవతా విలువల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు, నాలుగు మండలాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


