Saturday, 13 June 2026
  • Home  
  • గిరిజన పిల్లలకు విద్యా సామగ్రి పంపిణీ చేసిన బొబ్బేపల్లి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజన పిల్లలకు విద్యా సామగ్రి పంపిణీ చేసిన బొబ్బేపల్లి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 29 ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన పిల్లలకు స్లేట్లు, పెన్సిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. గిరిజనులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న రోజుల్లో గిరిజన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 29 ( పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన పిల్లలకు స్లేట్లు, పెన్సిల్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. గిరిజనులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గిరిజన బిడ్డకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రానున్న రోజుల్లో గిరిజన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.