Saturday, 3 October 2026
  • Home  
  • గాంధీజీ ఆశయాల బాటలో సమాజ సేవకు ప్రాధాన్యం అంగన్‌వాడీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు… మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి పిల్లి పెనుమర్తిలో అంగన్‌వాడీ ఉత్సవం.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాంధీజీ ఆశయాల బాటలో సమాజ సేవకు ప్రాధాన్యం అంగన్‌వాడీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు… మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి పిల్లి పెనుమర్తిలో అంగన్‌వాడీ ఉత్సవం.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సేవా మార్గం, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడాలనే ఆయన ఆశయాలు నేటి తరాలకు ఆదర్శమని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పెనుమర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు చీరలు అందించి శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు గర్భిణులకు చీరలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, ప్రాథమిక విద్యకు అంగన్‌వాడీ కేంద్రాలు కేంద్రబిందువులుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి ఎదుగుదలలో ప్రతి దశలోనూ అవసరమైన పోషకాహారం,విద్య,ఆరోగ్య సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు బాల సంజీవని, సంపూర్ణ పోషణ ప్లస్‌ వంటి కార్యక్రమాల ద్వారా మల్టీ గ్రెయిన్‌ అట్టా, రాగిపిండి, ఎండు ఖర్జూరం, చిక్కి, బెల్లం, బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార పదార్థాలను అందిస్తున్నట్లు తెలిపారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఆధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన బోధన అందించడంతో పాటు డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సేవలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా సేవలను మరింత విస్తృతం చేయవచ్చని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు ప్రతి అర్హ కుటుంబానికి చేరాలని, చిన్నారుల పోషణ, ప్రాథమిక విద్య విషయంలో తల్లిదండ్రులు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం బాల్యం నుంచే ప్రారంభం కావాలని, ఆ దిశగా అంగన్‌వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు అంగన్‌వాడీ ఉత్సవం అనంతరం పెనుమర్తి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని,వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగేలా చూడాలని సూచించారు.భవిష్యత్‌ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడంతో పాటు మహిళలు,చిన్నారుల సంక్షేమం,పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో తెలుగు యువత అధ్యక్షులు పిల్లి రాధా కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ జంపన సందీప్, ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె వీరబాబు,గ్రామ కమిటీ అధ్యక్షురాలు పెంకె వరలక్ష్మి,అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సేవా మార్గం, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడాలనే ఆయన ఆశయాలు నేటి తరాలకు ఆదర్శమని టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పెనుమర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు చీరలు అందించి శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు గర్భిణులకు చీరలు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, ప్రాథమిక విద్యకు అంగన్‌వాడీ కేంద్రాలు కేంద్రబిందువులుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి ఎదుగుదలలో ప్రతి దశలోనూ అవసరమైన పోషకాహారం,విద్య,ఆరోగ్య సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు బాల సంజీవని, సంపూర్ణ పోషణ ప్లస్‌ వంటి కార్యక్రమాల ద్వారా మల్టీ గ్రెయిన్‌ అట్టా, రాగిపిండి, ఎండు ఖర్జూరం, చిక్కి, బెల్లం, బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార పదార్థాలను అందిస్తున్నట్లు తెలిపారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఆధునిక విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. చిన్నారులకు ఆటపాటలతో కూడిన బోధన అందించడంతో పాటు డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. అంగన్‌వాడీ వ్యవస్థలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సేవలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా సేవలను మరింత విస్తృతం చేయవచ్చని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు ప్రతి అర్హ కుటుంబానికి చేరాలని, చిన్నారుల పోషణ, ప్రాథమిక విద్య విషయంలో తల్లిదండ్రులు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం బాల్యం నుంచే ప్రారంభం కావాలని, ఆ దిశగా అంగన్‌వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు

అంగన్‌వాడీ ఉత్సవం అనంతరం పెనుమర్తి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని,వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగేలా చూడాలని సూచించారు.భవిష్యత్‌ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడంతో పాటు మహిళలు,చిన్నారుల సంక్షేమం,పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో తెలుగు యువత అధ్యక్షులు పిల్లి రాధా కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ జంపన సందీప్, ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె వీరబాబు,గ్రామ కమిటీ అధ్యక్షురాలు పెంకె వరలక్ష్మి,అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.