గాండ్ల గూడలో దారుణం
వృద్ధ మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లు
పున్నమి న్యూస్
22మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్ల గూడ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న బ్యాగరీ పోచమ్మ (72) అనే వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు చైన్ స్నాచర్లు, పల్సర్ బైక్పై వచ్చి మాటలతో మభ్యపెట్టి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు.
ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. బాధితురాలు ఒక్కసారిగా షాక్కు గురికాగా, స్థానికులు వెంటనే యాచారం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బైక్పై వచ్చిన ఇద్దరు అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని యాచారం పోలీసులు సూచించారు.
ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్న చైన్ స్నాచర్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.



