కొణిజర్ల / ఖమ్మం
వినాయక చవితి సందర్భంగా కొణిజర్ల మండలం అనంతారం గ్రామంలోని గణనాథుని పూజా కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.



