Wednesday, 19 August 2026
  • Home  
  • గంజాయి కేసులో ఇద్దరికి జైలు శిక్ష.. రూ.10 వేల జరిమానా
- ఖమ్మం

గంజాయి కేసులో ఇద్దరికి జైలు శిక్ష.. రూ.10 వేల జరిమానా

ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. 2024 ఫిబ్రవరి 24న మమత హాస్పిటల్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా దుగ్గిరాల సూర్య నారాయణ 2 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. విచారణలో గంటెల నరేష్‌తో కలిసి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలు శిక్ష విధించిన కోర్టు, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.