Saturday, 16 May 2026
  • Home  
  • ఖాదర్ వల్లీ దర్గా ఉరుస్ మహోత్సవం సందడి – వేలాదిమంది భక్తులుతో ఆధ్యాత్మిక క్షణాలు
- అన్నమయ్య

ఖాదర్ వల్లీ దర్గా ఉరుస్ మహోత్సవం సందడి – వేలాదిమంది భక్తులుతో ఆధ్యాత్మిక క్షణాలు

అరవపల్లి దర్గాలో నిర్వహించిన ఖాదర్ వల్లీ ఉరుస్ మహోత్సవం ఈ సంవత్సరం విశేషంగా,వైభవంగా సాగింది.వేలాదిమంది భక్తులు ప్రాంతం నలుమూలల నుంచి తరలివచ్చి దర్గా ప్రాంగణాన్ని కిటకిటలాడేలా చేశారు. ప్రత్యేక పూజలు,ప్రార్థనలతో ఆధ్యాత్మికత నిండిన వేడుక రోజు అంతా ఘనంగా జరిగింది.ఖాదర్ వల్లీ దర్గాలోని చిన్న పీఠాధిపతి గురువులయ్య హైదర్ సాహెబ్ ప్రత్యేక దువా ఫాతిహా చేసి కార్యక్రమం మొదలపెట్టారు,నాగిరెడ్డిపల్లి దర్గాకు భక్తుల ఊరేగింపు బ్యాండ్‌బాజాలతో సాగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ జెండా ప్రదర్శన ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల సందడి మధ్య పోటాపోటీగా నబిరసూల్ అల్లా,వల్లీ సాహెబ్, హైదర్ సాహెబ్ ఖవ్వాలి పాటలతో రైల్వే కళాక్షేత్రంలో సాగిన ఖవ్వాలి కార్యక్రమం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మికత,సంగీతం,ఎన్నో గంటలు సాగిన ఈ ఖవ్వాలీలు దర్గా ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి.ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,మాట్లాడుతూ ఖాదర్ వలీ దర్గా చరిత్ర, సేవలు,భక్తుల విశ్వాసం గురించి ఉరుస్ మహోత్సవ మహిమాన్వితతను వివరించారు.ఈ సంప్రదాయాలు తరతరాలుగా భక్తులను ఏకం చేసే శక్తి కలిగినవని అన్నారు.అలాగే,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,అరవపల్లి దర్గా ఉరుస్ వైభవం గురించి మాట్లాడుతూ,కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ ఉత్సవాలు సామాజిక సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.స్థానికుల సేవాభావం,నిర్వాహకుల కృషి అభినందనీయం అన్నారు.సాంప్రదాయం,భక్తి, అనురాగంతో సాగిన ఈ మహోత్సవం భక్తుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు దాదాపీర్,తుమ్మది శివకుమార్,స్థానిక యువత సయ్యద్ సమీర్,షేక్ ఫయాజ్, నవాజ్,కార్పెంటర్ అజీమ్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

అరవపల్లి దర్గాలో నిర్వహించిన ఖాదర్ వల్లీ ఉరుస్ మహోత్సవం ఈ సంవత్సరం విశేషంగా,వైభవంగా సాగింది.వేలాదిమంది భక్తులు ప్రాంతం నలుమూలల నుంచి తరలివచ్చి దర్గా ప్రాంగణాన్ని కిటకిటలాడేలా చేశారు. ప్రత్యేక పూజలు,ప్రార్థనలతో ఆధ్యాత్మికత నిండిన వేడుక రోజు అంతా ఘనంగా జరిగింది.ఖాదర్ వల్లీ దర్గాలోని చిన్న పీఠాధిపతి గురువులయ్య హైదర్ సాహెబ్ ప్రత్యేక దువా ఫాతిహా చేసి కార్యక్రమం మొదలపెట్టారు,నాగిరెడ్డిపల్లి దర్గాకు భక్తుల ఊరేగింపు బ్యాండ్‌బాజాలతో సాగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ జెండా ప్రదర్శన ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తుల సందడి మధ్య పోటాపోటీగా నబిరసూల్ అల్లా,వల్లీ సాహెబ్, హైదర్ సాహెబ్ ఖవ్వాలి పాటలతో రైల్వే కళాక్షేత్రంలో సాగిన ఖవ్వాలి కార్యక్రమం ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మికత,సంగీతం,ఎన్నో గంటలు సాగిన ఈ ఖవ్వాలీలు దర్గా ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి.ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,మాట్లాడుతూ ఖాదర్ వలీ దర్గా చరిత్ర, సేవలు,భక్తుల విశ్వాసం గురించి ఉరుస్ మహోత్సవ మహిమాన్వితతను వివరించారు.ఈ సంప్రదాయాలు తరతరాలుగా భక్తులను ఏకం చేసే శక్తి కలిగినవని అన్నారు.అలాగే,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,అరవపల్లి దర్గా ఉరుస్ వైభవం గురించి మాట్లాడుతూ,కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ ఉత్సవాలు సామాజిక సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.స్థానికుల సేవాభావం,నిర్వాహకుల కృషి అభినందనీయం అన్నారు.సాంప్రదాయం,భక్తి, అనురాగంతో సాగిన ఈ మహోత్సవం భక్తుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు దాదాపీర్,తుమ్మది శివకుమార్,స్థానిక యువత సయ్యద్ సమీర్,షేక్ ఫయాజ్, నవాజ్,కార్పెంటర్ అజీమ్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.