ఖమ్మం నగర మినీ ట్రాలీ యూనియన్ అధ్యక్షులు, INTUC సీనియర్ నాయకులు నున్నా మాధవరావు (83) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ ప్రతినిధులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాధవరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాధవరావు అంత్యక్రియలు మంగళవారం (29-09-2026) ఉదయం ఖమ్మం గాంధీనగర్ సెంటర్లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..



