నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్ :ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) నిర్మల్ జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి. ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించగా, అనంతరం 15 మంది డైరెక్టర్లతో కూడిన మేనేజింగ్ కమిటీ పూర్తి కోరంతో ఎన్నికల ప్రక్రియను చేపట్టింది.
జిల్లా చైర్మన్ పదవికి యాటకారి సాయన్న, గొజ్జ జనార్దన్ పోటీ చేయగా, గొజ్జ జనార్దన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి నిర్మల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఎంసీ లింగన్న, ట్రెజరర్‌గా అల్లాడి రవి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి కె. సత్యనారాయణ వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారి శరత్ బాబు, సహాయకులు సాయందర్ మరియు వారి సిబ్బంది ఎలాంటి ఆందోళనలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్ గొజ్జ జనార్దన్, రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ షేక్ ముజాహిద్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్‌గా గొజ్జ జనార్దన్ ఎన్నిక వైస్ చైర్మన్‌గా ఎంసీ లింగన్న, ట్రెజరర్‌గా అల్లాడి రవి ఏకగ్రీవ ఎంపిక
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్ :ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) నిర్మల్ జిల్లా బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి. ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించగా, అనంతరం 15 మంది డైరెక్టర్లతో కూడిన మేనేజింగ్ కమిటీ పూర్తి కోరంతో ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. జిల్లా చైర్మన్ పదవికి యాటకారి సాయన్న, గొజ్జ జనార్దన్ పోటీ చేయగా, గొజ్జ జనార్దన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి నిర్మల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఎంసీ లింగన్న, ట్రెజరర్‌గా అల్లాడి రవి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా సామనపల్లి రాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జిల్లా సహకార అధికారి కె. సత్యనారాయణ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను సహాయ ఎన్నికల అధికారి శరత్ బాబు, సహాయకులు సాయందర్ మరియు వారి సిబ్బంది ఎలాంటి ఆందోళనలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్మల్ జిల్లా చైర్మన్ గొజ్జ జనార్దన్, రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ షేక్ ముజాహిద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

