- ఘనంగా సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం
కొవ్వూరు పట్టణం లోని బజార్ సెంటర్లో సి ఐ టి యు ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత జెండాను ఆవిష్కరించారు అనంతరం సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి శేషయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాల రాస్తున్నారని దుయ్యబట్టారు ఎన్నో ఏళ్ల క్రితం ప్రపంచ కార్మికులంతా పోరాడి సాధించుకున్న రోజుకు ఎనిమిది గంటల పని దినాలను రోజుకు 12 గంటలు మార్చటం దారుణమన్నారు కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేసి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు మండల ప్రధాన కార్యదర్శి , షేక్ ఖాదర్బాషా, భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు, హరి, అఫ్రోజ్, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు